గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పాట టీజర్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది.ఈ విషయాన్ని రవితేజ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. భలేగా తగిలావే బంగారమా అనే పాట రేపు విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.అంతేకాకుండా ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. మరి ఆశలు నిలుస్తాయో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Start the music! 🥁 #BalegaTagilaveyBangaram… teaser out tomorrow at 10 am! @megopichand @shrutihaasan @MusicThaman @anirudhofficial @dop_gkvishnu @ramjowrites pic.twitter.com/8F3fYwZ1xr
— Ravi Teja (@RaviTeja_offl) December 12, 2020
Advertisements