లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు చిత్రాలు మంచి సక్సెస్ ను సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ సినిమా హిట్ ను సాధించింది.
ముఖ్యంగా ఈ సినిమాకు శ్రుతిహాసన్ అందాలు, తమన్ మ్యూజిక్ రామ్-లక్ష్మణ్ ఫైట్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా రిలీజ్ కానుంది. జనవరి 29న వరల్డ్ ప్రీమియర్ గా స్ట్రీమ్ కాబోతుంది.