గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క్రాక్. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు వంటి చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని కసితో ఈ ఇద్దరు సినిమా చేశారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటించగా తమన్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమా విషయానికి వస్తే పోతరాజు వీరశంకర్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి తేజ కనిపించారు. అయితే ఓ ముగ్గురు నెరస్థులతో వీర శంకర్ గొడవ పెట్టుకుంటారు. వారిలో ఒకరు కటారి. కటారి పాత్రలో సముద్రఖని నటించారు.
కటారి క్యారెక్టర్ ఎలాంటిదంటే చుట్టుపక్కల 20 ఊర్లకు అతనంటే భయం. అలాంటి వ్యక్తితో పోతరాజు వీరశంకర్ గొడవ పెట్టుకుంటారు. తన సహోద్యోగి చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారి తో గొడవకు దిగుతాడు. ఈ నేపథ్యంలోనే వీరశంకర్ ని చంపడానికి కటారి ప్లాన్స్ చేస్తుంటాడు. ఇక కటారి ప్లాన్స్ ను వీరశంకర్ ఎలా ఎదుర్కొంటాడు. అనేదే ఇక్కడ కటారి కి వీరశంకర్ కు వైరం ఎలా వస్తుంది.. వీరశంకర్ కు జయమ్మకు సంబంధం ఏమిటి అనేది తెరపై చూడాలి. ఇక జయమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఇక కథ విషయంలో కొత్త కథను రాసుకోకుండా రొటీన్ కథనే సినిమాగా మలిచాడు దర్శకుడు. కేవలం మాస్ ఆడియన్స్ ను దృష్టి లో పెట్టుకొని సినిమా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కాస్త స్పీడ్ తగ్గింది.
అలాగే శృతి హాసన్ ను గ్లామర్ పరంగానే వాడుకున్నారు తప్ప నటనకు అవకాశం ఇవ్వలేదు. చిత్రంలో ముగ్గురు విలన్లు ఉన్నప్పటికీ కథ పరంగా వారిని చూపించలేకపోయారు. ఓవరాల్ గా మాత్రం రవితేజ కు ఓ మాస్ హిట్ వచ్చిందనే చెప్పాలి.