గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం క్రాక్. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్ మొన్నటి వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. కాగా ఇప్పుడు గోవాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి మొదలు కాబోతున్న షెడ్యూల్ ఈ సినిమాకు చివరి షెడ్యూల్. గోవా పర్యటనతో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. గోవా లోని కొన్ని లొకేషన్స్ లో రవితేజ శృతి హాసన్ ల మధ్య సాంగ్ ను షూట్ చేయనున్నారు.
ఈ పాటతో మొత్తం షూట్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.