పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కూడా ఉంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇందులో బందిపోటు గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి సగం షూటింగ్ పూర్తికాగా… మిగిలిన సగభాగం పై మేకర్ ప్లాన్ చేస్తున్నారు.
సోమవారం పవన్, హరీష్ శంకర్ ల కాంబో పై నిర్మాతలు పవన్ తో చర్చించగా… ఈ రోజు తాజాగా దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏ.ఎం రత్నం పవన్ తో భేటీ అయ్యారు. సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి… సన్నివేశాల సెట్టింగ్స్ ఇతర కీలక అంశాలకు సంబంధించి వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.