హైదరాబాద్ మాదక ద్రవ్యాల కేస్‌లో నిన్న ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణ కిషోర్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్‌లో భాగంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఫ్రెండ్స్ ద్వారా మత్తు పదార్థాలు అలవాటయ్యాయని కిషోర్ రెడ్డి తెలిపాడు. గోవా బెంగళూరు ముంబైలో వెళ్ళినప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళమని తెలిపాడు.
బిజినెస్ పార్టీలలో కూడా మత్తు పదార్థాలు ఉంటాయని వెల్లడించాడు. ఈ అలవాటుతోటే డ్రగ్స్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయని కృష్ణ కిషోర్ రెడ్డి వెల్లడించాడు. ఇంకా ఆయన స్టేట్‌మెంట్‌లో.. బెంగళూరు, గోవా నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువచ్చే వాళ్ళతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ఫార్మ్ హౌస్, పబ్బులలో ఫ్రెండ్స్‌కి మత్తు పదార్థాల పార్టీ ఇచ్చాము. కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలను కూడా నిర్వహించాము.
పార్టీలలో డీజేల కోసం మోహిత్ అగర్వాల్ కాంటాక్ట్ చేశాడు. డీజే ప్లేయర్‌లతో పాటుగా మాదక ద్రవ్యాలు కూడా మోహిత్ సరఫరా చేశాడు. బిజినెస్ పార్టీలు, రేవ్ పార్టీల కోసం వాటిని తెప్పించేవాణ్ణి. లగ్జరీ బస్సులో పార్సెల్ ద్వారా మాదక ద్రవ్యాలను తెప్పించాను. పచ్చళ్ళు ఎనర్జీ ఫుడ్డు మధ్యలో మత్తు పదార్థాలు పెట్టి పార్సెల్ పంపించేవాళ్లు.
మాదక ద్రవ్యాల ఫోటోలు, డ్రైవర్ ఫోటోలు, బస్సు నంబరు, బస్సు ఫోటోలని వాట్సాప్‌లో షేర్ చేసేవాళ్ళు. నా దగ్గర పని చేస్తున్న సిబ్బందిని పంపించి మత్తు పదార్థాలు ఉన్న పచ్చళ్ళు, ఎనర్జీ ఫుడ్డు డబ్బాలను తెప్పించుకునే వాన్ని. ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు కస్టమర్లకు చేరుతున్నాయి.