ఈ తరానికి ఎస్వీ కృష్ణా రెడ్డి అంటే ఎవరో తెలియదు గాని అప్పట్లో ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ఫాన్స్ లో ఒకరకమైన క్రేజ్ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఆయన సినిమాలు చేసేవారు. అగ్ర హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు. హిట్ లు లేని దర్శకులకు సైతం ఆయన హిట్ లు ఇచ్చారు. తాజాగా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇదిలా ఉంటే ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ కు మధ్య మంచి అనుబంధం ఉండేది అప్పట్లో. కృష్ణ కూడా ఎస్వీ కృష్ణా రెడ్డి తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. ఇక ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమాలో ఒక్క సీన్ చెప్తే చాలు చేసిన సినిమా కూడా ఉంది. అది ఏంటి అంటే… నంబర్ 1 సినిమా. ఈ సినిమా కథ కృష్ణకు చెప్పే సమయంలో ఒకే ఒక్క సీన్ చెప్పారట కృష్ణా రెడ్డి. అది ఆయనకు బాగా నచ్చేసింది.
వెంటనే ఆ టైటిల్ తోనే సినిమా మొదలుపెట్టాలి అని చెప్పారట. కాని అప్పటికే సినిమా పరిశ్రమలో నంబర్ 1 హీరోలు చాలా మంది ఉన్నారు. అది పెడితే గొడవ అవుతుందేమో అని భావించారట. దీనిపై కృష్ణా రెడ్డి ఒక వివరణ ఇచ్చారు. కృష్ణగారికే ఆ టైటిల్ పెట్టడం పై చాలా మంది తనను ప్రశ్నించారని, తన సినిమా కథ ప్రకారం అదే టైటిల్ కరెక్ట్ గా ఉంటుందన్నారు. సినిమాలో కుటుంబ బాధ్యతలు తీసుకునే కొడుకే నెంబర్ వన్ అని అలా నా సినిమాకు నెంబర్ వన్ అని టైటిల్ పెట్టాం అని క్లారిటీ ఇచ్చారు.