ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చెన్నై. ఒక్క తెలుగు సినిమానే కాదు మన సౌత్ లో దాదాపుగా అన్ని అక్కడే. ఏ సినిమా షూటింగ్ అయినా సరే అక్కడే జరగాలి అన్నట్టు ఉండేది. ఇప్పుడు మనకు అన్నపూర్ణ, రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు ఉన్నాయి గా అక్కడ అయితే…
విజయ వాహినీ, లేదా జెమినీ స్టూడియోలోనే షూటింగ్ జరిగేది. ఆ తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరగడంతో… ఎక్కడ సినిమా అక్కడ షూట్ అవుతుంది.
ఎన్టీఆర్ హయాంలో తెలుగు సినిమా ఇక్కడికి వచ్చింది. ఇక ఈ నాలుగు భాషల్లో రీమేక్ సినిమాల సందడి చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం మెగా హీరోలు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. 1985 లో పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ పోర్ట్ హీరోగా వెట్ నెస్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను మన దేశానికి తగినట్టు మార్పులు చేసి ముమ్ముట్టి, నదియా జంటగా పూవిన్ పూతియా ఫూన్ తేన్నెల సినిమాను తీసుకొచ్చారు.
Also Read:అలియాభట్ సింగిల్ టేక్ రొమాన్స్
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో హీరోలు కాస్త గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అల్లు అరవింద్ ఈ సినిమా హక్కులు కొన్నారు. ఈ విషయం తెలియక… విజయ బాపినీడు అదే కథతో మరో లైన్ రాసుకున్నారు. ఆచంట గోపీనాథ్ నిర్మాతగా శ్రీదేవి, కృష్ణ జంటగా సినిమా రావాల్సి ఉంది. మహేష్ బాబు బాలనటుడిగా చేయాల్సి ఉంది. అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుందని భావించిన కొన్ని రోజులకు… చిరంజీవి హీరోగా కోదండ రామిరెడ్డి… దర్శకత్వంలో వస్తుందని తెలియడంతో కృష్ణ డ్రాప్ అయ్యారు. ఆ సినిమానే పసివాడి ప్రాణం అన్నమాట.