చాలా మందికి సిల్క్ స్మిత అనగానే ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. ఇప్పటికి కూడా ఆమెను చాలా మంది చీప్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని అయినా తిట్టాలి అంటే ఆమె పేరు వాడి తిడుతూ ఉంటారు. కాని ఆమె అప్పట్లో హీరోయిన్ గా సినిమాలు చేసి ఉంటే మాత్రం ఆమెకు మంచి ఇమేజ్ వచ్చేది అని స్టార్ హీరోల పక్కన వరుస ఆఫర్లు వచ్చేవి అని అంటూ ఉంటారు కొందరు.
ఆమెను సరిగా అర్ధం చేసుకోలేదని అందుకే ఆమె కెరీర్ వెనకడుగు వేసింది అని అంటారు. ఇక సినిమా పరిశ్రమలో ఆమెను వాడుకుని వదిలేసారు అని స్టార్ హీరోలు చాలా మంది ఆమె పక్కన కనపడటానికి ఇష్టపడలేదు అని అంటారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఆమె విషయంలో చాలా పెద్ద అడుగు వేసారు. 80 లలో కృష్ణ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీనికి చిరంజీవి కారణం అని కూడా అంటారు.
దీనితో కృష్ణ కాస్త ఆలోచనలో పడ్డారు. అప్పట్లో సిల్క్ ఉన్న సినిమా హిట్ అయ్యేది. ఆమె ఐటెం సాంగ్ కోసం చాలా మంది క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే కృష్ణ రౌడీ అన్నయ్య అనే సినిమాలో పట్టుబట్టి ఆమె సాంగ్ పెట్టించారు. ఆ సినిమాలో బాబు మోహన్ నటించగా ఆయన పక్కన ఆమె ఐటెం సాంగ్ పెట్టించాలి అని దర్శకుడు భరద్వాజ్ భావించారు. కాని తమిళంలో హీరోలు ఆమె పక్కన డాన్స్ చేస్తే జనాలు చూసారు. అందుకే తానే చేయాలి అనుకున్నారు. దర్శకుడు నో అంటే ఆయనను పక్కన పెట్టేసారు. వాకిట్లో రోకలి పెట్టా.. నట్టింట్లో తిరగలి పెట్టా అనే పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. సినిమా కూడా బాగా ఆడింది. పద్మాలయ స్టూడియో లో సెట్ వేసి చేసారు.