ఏ సినిమాకైనా ఎండింగు స్టార్టింగు చాలా ముఖ్యం. సినిమా విజయానికి అవేకీలకం.కనుక స్క్రిప్ట్ దశలో చాలా మార్పులూ,చేర్పులూ జరుగుతూ ఉంటాయి. సంబంధిత సలహాలు నిర్మాత నుంచి రావొచ్చు లేదా హీరోనుంచి కూడా రావొచ్చు.
తొలుత దర్శకుడు అనుకున్న కథకి హీరోలు లేదా నిర్మాతలు ఇచ్చిన సలహాలు ఫలించిన సినిమాలు చాలానే ఉన్నాయి అలాంటి వాటిలో నిన్నేపెళ్ళాడతా సినిమా ఒకటి.
1996 లో కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సింధూరం సినిమాతో తన మార్కు చూపించుకొని వరస సినిమాలకు దర్శకత్వం వహించి, మంచి విజయాలను తన సొంతం చేసుకున్నాడు కృష్ణ వంశీ.
నాగార్జున వంటి స్టార్డమ్ ఉన్న హీరోతో ‘నిన్నే పెళ్ళాడతా’సినిమా తీసి మరొక అద్భుతమైన చిత్రాన్ని అభిమానులకు అందించాడు.కృష్ణ వంశీ కథ చెప్పిన వెంటనే ఓకే చేసి తానే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసాడు నాగార్జున.
ఈ సినిమా విడుదల అయ్యాక మ్యూజికల్ గా చాల పెద్ద హిట్ అయ్యింది.మాములుగా నాగార్జునకి శివ సినిమా బాగా పెద్ద హిట్ అయ్యింది.ఆ తర్వాత అంత స్థాయి హిట్ అందుకోవడం లో నాగార్జున చాల ఏళ్ళ పాటు పరాజయాలు చవి చూసాడు.
‘శివ’ స్థాయి విజయం అందుకోవడానికి నాగార్జున కి చాల కష్టం అవుతున్న సమయం లో నిన్నే పెళ్లాడతా సినిమా నాగార్జున కెరీర్ లో అతి పెద్ద విజయం గా నిలిచింది. గులాబీ సినిమా చేస్తున్న సమయంలోనే కృష్ణ వంశీ ని తన సినిమాకు డైరెక్ట్ చేయమని నాగార్జున రిక్వెస్ట్ చేయడం తో కృష్ణ వంశీ అందుకు ఒకే చెప్పాడు.
రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఉన్న కృష్ణ వంశీ కి ఈజీ గానే నాగార్జున తో రాపో పెంచుకున్నాడు. ఇక సినిమా మొత్తం లవ్ మరియు కుటుంబ నేపథ్యం లో తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
ఇక క్లైమాక్స్ తీయడానికి అంత ఒకే చేసుకున్న సమయంలో నాగార్జున కృష్ణ వంశీ ని పిలిచి ఒక సారి క్లైమాక్స్ ఎలా తీయాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు. మొత్తం విన్నాక క్లైమాక్స్ మార్చేయాలని చెప్పాడు.
సినిమా మొత్తం లైటర్ వే లో ఉన్న టైం లో సీరియస్ గా క్లోజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో మామూలుగానే ఎవరి మాట వినని కృష్ణ వంశీ రాత్రికి రాత్రే ఒక క్లైమాక్స్ రెడీ చేసి పొద్దున్నే నాగార్జున కి చెప్పి మరీ ఒకే చేయించుకొని తీసాడట.ఆలా క్లైమాక్స్ మార్చడం వల్లనే సినిమా హిట్ అయ్యింది.అంటూ కృష్ణ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నాడు.
Also Read: చంటి సినిమాకి ఫస్ట్ అనుకున్న హీరో అతనా…!