కృష్ణ బృందా విహారి అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో సినీ ప్రేమికులను అలరించేందుకు నాగ శౌర్య సిద్ధమవుతున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు.ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్ లో హీరోయిన్ షిర్లీ సెటియా నాగ శౌర్య వెనుక కూర్చుని ఉండగా నాగ శౌర్య స్కూటర్ నడుపుతూ కనిపించాడు. అలాగే ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.