బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా క్రిష్ 4 సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా అందులో ఓ హీరోయిన్ గా కృతిసనన్ ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా ఇంకా ఎవర్ని ఎంపిక చేయలేదు. అయితే కృతిసనన్ కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కాల్షీట్లు ఖాళీ లేకపోవటంతో ఆ అవకాశం కియారా అద్వానీకి దక్కినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హృతిక్-కియారా కాంబినేషన్ కొత్తగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం కియారా బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన జవానీ కీ దివానీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.