కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు..అక్కినేని నాగచైతన్యతో చేస్తున్న క్రైమ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కస్టడీ”. క్యూట్ లుక్ తో కుర్రకారుని కిర్రెక్కించే కృతిశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ్ లో భాషల్లో తెరకెక్కుతూ మంచి బజ్ ని సొంతం చేసుకుందీ చిత్రం.
ఆల్రెడీ వచ్చిన టీజర్, చైతూ ఫస్ట్ లుక్ పోస్టర్ లు అభిమానుల అంచనాలు పెంచాయి. తాజాగా కృతిశెట్టి పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఆసక్తికరంగా ఉందీపోస్టర్.
కృతిశెట్టి ఎమోషనల్ యాక్టింగ్ ని ఎలివేట్ చేసేదిగా కనిపిస్తోంది.ఇక ఈమె రోల్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.‘కస్టడీ’ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్రం మే 12న రిలీజ్ కాబోతుంది.