అదృష్టం కలిసొస్తే అలానే ఉంటుంది. వరుసపెట్టి అవకాశాలు రావడమే కాదు, రకరకాల పరిశ్రమల్లో ఎంట్రీ కూడా దక్కుతుంది. ప్రస్తుతం అలాంటి అదృష్టాన్నే ఎంజాయ్ చేస్తోంది కృతి శెట్టి. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు చాలామంది హీరోయిన్లు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే, అప్రయత్నంగానే తమిళనాట ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ.
“కోలీవుడ్ ఎంట్రీపై చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఉప్పెన మూవీ టైమ్ నుంచి కోలీవుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు నేను ఊహించలేదు. అంత ప్రేమ చూపిస్తారని! అనుకోకుండా వారియర్ తో తమిళ్ లో అడుగుపెడుతున్నాను. ఇది ద్విభాషా చిత్రం. తమిళంలో కూడా షూట్ చేశాం. తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నాను. అందులో సూర్య హీరో. నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు – తమిళ్ బైలింగ్వల్ మూవీ. దీంతో ఇక తమిళ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.”
ఇలా వరుసపెట్టి తమిళ సినిమాలు చేస్తోంది కృతి శెట్టి. ఇవన్నీ తను ప్లాన్ చేయలేదని, అలా జరిగిపోయాయని చెబుతోంది. ప్రస్తుతానికైతే తమిళ్ నేర్చుకుంటున్నప్పటికీ.. డబ్బింగ్ మాత్రం తను చెప్పడం లేదని తెలిపింది. షూటింగ్ టైమ్ లో ప్రామ్టింగ్ మాత్రమే ఇస్తున్నానని, డబ్బింగ్ వేరే వాళ్లు చెబుతారని అంటోంది.
అయితే.. రామ్ మాత్రం ఈ విషయంలో చాలా కష్టపడుతున్న విషయాన్ని కృతి బయటపెట్టింది. తమిళ వెర్షన్ కు సంబంధించి ప్రతి సీన్, డైలాగ్ కోసం రామ్ చాలా కష్టపడుతున్నాడని, తమిళ్ లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాడని వెల్లడించింది.