తెలుగు చిత్ర పరిశ్రమకు యంగ్ హీరోయిన్స్ రావడం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీని వల్ల ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోయిన్లకు అవకాశాలు గల్లంతు అవుతున్నాయి. స్టార్ హీరోయిన్.. లక్కీ హీరోయిన్ అనే పేర్లు ఉన్నవారికి కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళం, మలయాళం నుంచి వచ్చే భామలకే ఎక్కువగా సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి.
అయితే వీరిలో బాగా ట్రెండ్ అయిన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో కుర్రకారుని తన వలలో వేసుకుంది. దీని తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు కూడా హిట్ కావడంతో టాలీవుడ్ లో కృతి శెట్టికి తిరుగులేదని అందరూ భావించారు. కానీ, ఈమె భామ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
బ్యాక్ టు బ్యాక్ మూడు అపజయాలను కృతి శెట్టి చవి చూసింది.
దీని తర్వాత ఈ ఉప్పెన బ్యూటీకి అవకాశాలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఈమె నాగ చైతన్యతో కస్టడి, అజాయంతే రందం మోషణం అనే మలయాళ సినిమా మాత్రమే చేస్తోంది. వీటి తర్వాత కొత్తగా ప్రాజెక్ట్ లకు ఈమె సైన్ చేయలేదు.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. కృతి శెట్టికి మరో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. శర్వానంద్ కు జోడీగా ఈ యంగ్ బ్యూటీ ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే శర్వానంద్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో శర్వాకు జోడీగా కృతిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి.