నిజజీవితంలో హీరోయిన్లు ప్రేమలో పడడం సహజం. ఒకప్పుడు గుంభనంగా సాగే డేటింగ్ వ్యవహారాల్ని, ఇప్పుడు ఘనంగా చెప్పుకుంటున్నారు. తను ప్రేమలో ఉన్నానంటూ రకుల్ లాంటి హీరోయిన్లు ఓపెన్ గా చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో కృతి శెట్టి కూడా ఉందని చాలామంది అనుకున్నారు. కానీ ఉప్పెన బ్యూటీ మాత్రం ఆ పుకార్లను ఖండించింది. ప్రస్తుతం తన జీవితంలో లవ్, రొమాన్స్ కు టైమ్ లేదని చెప్పేసింది.
“ప్రేమ, రొమాన్స్ లాంటివి నా వ్యక్తిగత జీవితంలో లేవు. ఎందుకంటే వాటి కోసం టైమ్ కేటాయించే పరిస్థితిలో నేను లేను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది. వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. వ్యక్తిగత పనుల కోసం కూడా టైమ్ కేటాయించే పరిస్థితిలో లేను. అలాంటిది లవ్ అంటే చాలా కష్టం.”
ఇలా తనపై వస్తున్న ప్రేమ పుకార్లను ఖండించింది కృతి శెట్టి. తనకు ప్రేమించే వయసు వచ్చిందేమో కానీ, మనుషుల్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదంటోంది ఈ బ్యూటీ. ఇంకాస్త మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు ప్రేమ గురించి ఆలోచిస్తానని కూడా చెబుతోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో బిజీగా ఉంది. రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటిస్తోంది. సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా పూర్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా నటిస్తోంది. ఇవి కాకుండా, మరో 3 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.