సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఏ భాష సినిమా అయినా ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా పెద్ద హీరోలపై రోజుకో రకం పుకార్లు వస్తుంటాయి. అందులోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అతనికి భార్యగా ఎవరు వస్తారో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ క్రిటిక్ బాలీవుడ్ ఫేమస్ క్రిటిక్ ఉమైర్ సంధూ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
ప్రభాస్ తర్వలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అతను ట్విట్టర్ లో రివీల్ చేశాడు. మాల్దీవుల్లో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నాడని వెల్లడించాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్ మెంట్ వార్తలపై ప్రభాస్ టీం స్పందించింది. ఉమైర్ సంధు కథనాల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థ వార్తల్లో వాస్తవం లేదని.. కొందరి ఉత్సాహం మాత్రమే అని చెప్పుకొచ్చింది. అటు ప్రభాస్ సహనటుడు, స్నేహితులు కూడా ఈ వార్తలను కొట్టిపారేశారు.
కాగా ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రం తెరకెక్కుతోంది. రామాయణం కథ ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. ఇందులో సీత పాత్రలో కృతి, రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఎప్పుడైతే ఆదిపురుష్ మూవీ సెట్స్‌పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.