కరోనా మహమ్మారి దేశంలో ఇప్పటికీ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు పడగా తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా పడింద ని సమాచారం. ప్రస్తుతం రాజ్ కుమార్ రావు తో కలిసి కృతిసనన్ ఓ సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా చండీగఢ్ ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా అక్కడి నుండి వచ్చిన తర్వాత కృతి సనన్ కు కరోనా లక్షణాలు బయట పడ్డాయట.
ఇక కృతిసనన్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా కృతి సనన్ కు హిట్ ను ఇవ్వలేకపోయాయి. ఆ సమయంలో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయింది ఈ అమ్మడు.