ఆదిపురుష్ ట్రైలర్ లో కృతి సనన్ ను చూసి ఫ్యాన్స్ సీతమ్మ తల్లిని చూసినంత ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకు కారణం ఆమె ఆ రోల్ లో అంతాగా ఒదిగిపోవడమే. అయితే సీతగా పాత్రను పండించడానికి కృతి సనన్ చాలానే శ్రమ పడిందటా..
సాధారణంగా సెలబ్రిటీలు తమ సినిమాల కోసం లుక్ ను మార్చుకుంటుంటారు. సినిమాకు అనుగుణంగా లుక్ ఎలా ఉండాలో అలానే తయారై అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. దీంతో పాత్రలోకి ఒదిగిపోతారు. అయితే దీని కోసం చాలానే కష్టపడాల్సి ఉంటుంది. జాగ్రత్తలు కూడా చాలానే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ రోల్ పండుతుంది.
ఇక త్వరలో రిలీజ్ కానున్న ఆదిపురుష్ సినిమా కోసం కృతి సనన్ కూడా చాలానే కష్టపడింది. జానకి పాత్రలో సహజంగా కనిపించాడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది. ట్యూటర్ ను పెట్టుకొని తెలుగు నేర్చుకున్నానని ఆమె చెప్పింది. ఇక బేసిక్ గా నాన్ వెజ్ ఫుడ్స్ అంటే మహా ఇష్టపడే ఆమె సీత పాత్రలో సాత్వికంగా ఉండేందుకు నాన్ వెజ్ కి చాలా సార్లు దూరమైందట.
ఎప్పుడూ మోడ్రన్ లుక్ లో దర్శనమిచ్చే ఆమె ఈ సినిమా షూటింగ్ ముగిసే వరకూ చాలా సందర్భాల్లో చీరకట్టుతోనే కనిపించింది. ఇక దీపికా పదుకొణె, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్లతో పోటీ పడి మరీ ఈ పాత్రను చేజిక్కించుకుంది కృతి. ఇలాంటి పాత్రలు ప్రతి నటికి జీవితకాలంలో అరుదుగా వస్తుంటాయి. దీన్ని సినిమాగా కాకుండా నా జీవితంలా భావిస్తానని ఆమె షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే చెప్పింది.
అయితే జానకి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ పాత్రలో జీవించడానికి చాలానే పుస్తకాలు తిరిగేసిందట. అంతే కాదు సినిమా ట్రైలర్ విడుదల సమయంలోనూ ఆమె ఓ సాధ్విలా కనిపించేందుకు ప్రయత్నించింది.