‘డబ్బులిస్తేనే ఏ సినిమాపైనైనా టీవీ9లో ఫోకస్ చేస్తున్నారు.. చిన్న సినిమాల్ని అసలు పట్టించుకోవడమే లేదు’ అంటూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఆగ్రహం తీవ్ర ఆరోపణ చేశారు. టీవీ9, మరో ఛానల్‌లకు చిన్న సినిమాలంటే చిన్నచూపు అని దుయ్యబట్టారు. తాను నిర్మాతగా తీసి ఇటీవలే విడుదలైన ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాకు టీవీ9 ప్రాధాన్యం ఇవ్వలేదని, చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహమే ఇవ్వరని అన్నారు. తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేయగా, ఈ ఛానళ్లు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని, తాను డబ్బులు ఇవ్వలేదన్నదే దీని వెనుక కారణమని ఆరోపించారు. చిన్న సినిమాలపై మీడియా చిన్నచూపు పెరిగిందని, మహేశ్ బాబు, చిరంజీవి సినిమాలంటేనే సినిమాలను కుంటున్నారని ఆయన ఆరోపించారు. సినిమా సక్సెస్ మీట్‌లో కేఎస్ రామారావు చేసిన వ్యాఖ్యల్ని మీరూ చూడవచ్చు..
Tolivelugu Latest Telugu Breaking News » Viral » డబ్బులిస్తేనే ఫోకస్.. టీవీ9పై కెఎస్ కస్సుబుస్సు