ఎనిమిదేళ్లగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సమాధానం లేదు. ప్రజల సమస్యలకు పరిష్కారం లేదు. తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తున్న ప్రతిసారీ.. కేంద్రం పై యుద్ధం పేరుతో డైవర్ట్ చేస్తారు. ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తే.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ పక్కదోవ పట్టిస్తారు. కానీ.. ప్రజల అవసరాలు మాత్రం పట్టవు. కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి ఇదే తంతు. ఆంధ్రోళ్లు తెలంగాణ భూములను బీడు భూములుగా మార్చారని ఉమ్మడి ఆంధ్రాలో గగ్గోలు పెట్టిన కేసీఆర్.. అధికారం చేతికొచ్చాక కేంద్రం తెలంగాణ రైతులను మోసం చేస్తుంది అంటున్నారు. ఆంధ్రులకే ఉద్యోగాలా అని అప్పట్లో ప్రశ్నించి గులాబీ బాస్.. ఇప్పుడు నోటిఫికేషన్ల మాటే ఎత్తడం లేదు. అప్పట్లో దళిత సీఎం అన్నారు.. ఇప్పుడు కనీసం దళితులకు మూడెకరాల మాట కూడా లేదు. వీటి గురించి అడిగితే.. ఆంధ్రా వాళ్లని తిట్టడం, కేంద్రంతో యుద్ధం అని కలరింగ్ ఇవ్వడం, ఫెడరల్ ఫ్రంట్ అనడం ఎనిమిదేళ్లు గా ఇదే రాజకీయ వ్యూహంతో నెట్టుకొస్తున్నారు. అయితే.. అన్ని సమస్యలకు తొలి వెలుగు వేదికగా పరిష్కారం దొరుకుంది అనుకున్నాం. కానీ.. మంత్రి కేటీఆర్ దానికి సాహసించలేదు.
నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అని కేటీఆర్ ఇటీవల అన్నారు. దీనిపై ఎవరితో అయినా చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన రేవంత్ చర్చకు సై అన్నారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించడానికి తాము రెడీ ముందుడుగు వేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చించడానికి తొలివెలుగుని రేవంత్ వేదిక చేసుకున్నారు. కానీ.. కేటీఆర్ ముఖం చాటేశారు. అదే సమయంలో ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే.. ఈ ప్రోగ్రాంలో కేటీఆర్ కు నెటిజన్లు చుక్కలు చూపించారు. తొలివెలుగు స్టూడియోకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీరే సవాల్ విసిరారు కదా? రేవంత్ సవాల్ స్వీకరిస్తే ఎందుకు వెనకడుగు వేశారు? రైతుల గురించి అడుగుతారని భయమా? నిరుద్యోగులపై అడిగే ప్రశ్నలకు సమాధానం లేదా? ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
మరోవైపు కేటీఆర్ ముఖం చాటేయడంపై రేవంత్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారే ప్రజల సమస్యలపై మాట్లడలేకపోతే.. ఇంకా ఆ పదవులు ఎందుకు అని ప్రశ్నించారు. నీ సవాల్ స్వీకరించా.. తొలివెలుగుకు వచ్చా… కేటీఆర్ నువ్వెక్కడ..? ఎంతకాలం దాక్కుంటావ్ అని రేవంత్ ప్రశ్నించారు.