– రాష్ట్రంలో దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు
– తాతల కాలం నుండి భూస్వాములమేనన్న కేటీఆర్
– కేటీఆర్ వ్యాఖ్యలపై పోటెత్తిన విమర్శలు
– ప్రతిక్షాలు చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రజలకు చేరాయా..?
– పదవులొచ్చాక ఆస్తులు పెరిగాయనే భావన ప్రజల్లో నాటుకుపోయిందా..?
– పీకే నుండి ఫీడ్ బ్యాక్ ఏమైనా అందిందా..?
– ఆ భావనను పోగొట్టడానికే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా..?
– రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకున్న చర్చలు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలు పెరిగిపోయాయని.. రైతులు, సామాన్యుల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే.. వాటికి ఆథ్యం పోసే విధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తన అమ్మమ్మ ఊరు కొనపూర్ లో పర్యటించిన సందర్బంగా.. తాము పుట్టుకతో భూస్వాములమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇంతకాలం తమ ఆస్తులకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేటీఆర్.. ఆరోపణలు రాగానే ఆస్తుల గురించి మాట్లాడటంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా సాగుతోంది..? కేసీఆర్ కుటుంబం మీద ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది..? అనే విషయాలను కూలంకుశంగా కేసీఆర్ కు వివరించారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ సీఎం అయ్యాక కల్వకుంట్ల కుటుంబంలో అందరికి పదవులొచ్చాయి.. ఆస్తులు సంపాధించుకున్నారని విపక్షాలు సైతం ప్రజల్లోకి వెళ్లి తెలియజేసే ప్రయత్నాలు చేశారు. అయితే.. ప్రతిక్షాలు చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రజలకు చేరాయా..? అందుకు సంబంధించి పీకే నుండి ఫీడ్ బ్యాక్ ఏమైనా అందిందా..? ఇంటిళ్లిపాదికి పదవులు వచ్చాయి.. వాళ్ల ఆస్తులు పెరిగాయనే భావన ప్రజల్లో నాటుకుపోయిందా..? ఆ భావనను పోగొట్టడానికే భహుషా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా..? అనే చర్చ కూడా తెరలేపింది.
కేసీఆర్ నాయకత్వంలో తెలగాణ రాష్ట్రం ఏర్పడితే అది దొరల తెలంగాణ అవుతోంది తప్పా.. ప్రజల తెలంగాణ కాదు.. ప్రజాస్వామిక తెలంగాణ కాదు.. సామాజిక తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కాదనే విమర్శలు ఉద్యమ సమయ నుండి పెంకుటిల్లుతున్నాయి. దానికి తోడు కేసీఆర్ అనగానే దొర.. దొరపోకడలతో వ్యవహరిస్తారనే విమర్శలు ప్రజల్లో జోరుగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో.. అది నిజమే అనే విధంగా కేటీఆర్ ప్రజలకు వివరణ ఇచ్చారా..? అనే కోణంలో రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు. అయితే.. కేసీఆర్ దొర పోకడలతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తాయా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపడానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లాయా..? కేసీఆర్ ఆస్తులన్ని ఇప్పుడు సంపాధించుకున్నవి కాదని ప్రజలు నమ్మారా..? అనేది పక్కకు పెడితే.. కేసీఆర్ కు దొరపోకడలు ఉన్నాయనేది మాత్రం తన కొడుకే తెలియజేశారని విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఏర్పడక ముందు రాజకీయ శైలి చూసుకుంటే.. తేడాలు వచ్చాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఓటుకు ఆరువేల రూపాయల చొప్పున పంచారనే ఆరోపణల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఆర్ధిక వనరులను ఎలా సమకూర్చుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే భూస్వామి కుటుంబానికి చెందిన వ్యక్తే అయితే.. ఉద్యమసమయంలో ఇళ్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందనే విమర్శలు లేవనెత్తుతున్నాయి. వందల ఎకారాల భూములు ఉంటే.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి 2018 ముందస్తు ఎన్నికల వరకు ప్రతీ ఎన్నికలో పోటీ చేస్తున్న కేసీఆర్.. ఎన్నికల ఆఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు విమర్శకుల్లో వెల్లువెత్తుతున్నాయి.