• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

గ‌ల్ఫ్ దేశాల్లో క‌నీస వేత‌న స‌వ‌ర‌ణ‌- కేటీఆర్ స‌ర్ ఇప్పుడే నిద్ర‌లేచారా…?

Published on : December 23, 2020 at 5:12 pm

పొట్ట చేత‌ప‌ట్టుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాల బాట ప‌డుతున్న భార‌త పౌరుల మెడ‌పై అనుకోని క‌త్తి ప‌డింది. గ‌ల్ఫ్ దేశాల్లో క‌నీస వేత‌నాన్ని త‌గ్గిస్తూ కేంద్రం సెప్టెంబ‌ర్ 21,2020న స‌ర్కుల‌ర్ జారీ చేసింది. దాదాపుగా 30-50శాతం క‌నీస వేత‌నంలో కోత విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Gulf Air | LinkedIn

కొత్త నిర్ణ‌యం ప్ర‌కారం… బెహ్ర‌యిన్, ఓమ‌న్, యూఏఈలో నెల‌కు క‌నీసం 200డాల‌ర్లు, సౌదీ అరేబియాలో 324అమెరిక‌న్ డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. ఖ‌తార్ లో 200అమెరికన్ డాల‌ర్లు, కువైట్ లో 245డాల‌ర్లు, ఇంటి ప‌నుల్లో స‌హాయం చేసేవారికి 196డాల‌ర్లుగా నిర్ణ‌యించారు.

సెప్టెంబ‌ర్ లో ఈ నిర్ణ‌యం తీసుకుంటే… తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఈ క‌నీస వేత‌నంపై పెద‌వి విప్పారు. ఇది అన్యాయ‌మ‌ని, 30-50శాతం వేత‌నాన్ని త‌గ్గిస్తే ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. ముఖ్యంగా తెలంగాణ నుండి ఎంతో మంది గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్తార‌ని, దీనిపై విదేశాంగ మంత్రి జ‌యశంక‌ర్ స్పందించాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ కోరారు.

Hon'ble MEA @DrSJaishankar Ji

The recent circulars issued by MEA reducing Minimum Referral Wages by 30-50 percent as reported are a cause for huge concern as wages of lakhs of migrant workers from Telangana working in the Gulf countries will get adversely impacted pic.twitter.com/yfF8jPX6RW

— KTR (@KTRTRS) December 22, 2020

కేటీఆర్ ట్వీట్ పై తెలంగాణ‌లో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. గల్ఫ్ బాధ‌లు పోవాలంటే తెలంగాణ రావాల‌ని, గల్ఫ్ బాధితుల కోసం తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక ప్ర‌త్యేక పాల‌సీ తెచ్చి ఆదుకుంటామ‌ని చెప్పిన స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌ని… ఇప్పుడు ఇంత జ‌రుగుతున్న సీఎం కేసీఆర్ స్పందించ‌లేద‌ని, సెప్టెంబ‌ర్ లో క‌నీస వేత‌నం త‌గ్గిస్తే ఇప్పుడు కేటీఆర్ కేవ‌లం ట్వీట్ తో స‌రిపెట్టార‌ని విమ‌ర్శిస్తున్నారు. గ‌ల్ఫ్ వ‌ర్క‌ర్స్ కోసం ప్ర‌త్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయార‌ని, తెలంగాణ నుండి ల‌క్ష‌ల మంది గ‌ల్ఫ్ బాట ప‌డుతుంటే వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేదంటున్నారు. కేవ‌లం ఒక్క ట్వీట్ తో స‌రిపెడుతున్నారంటున్నారు.

అయితే, ఇలా క‌నీస వేత‌నం అనే కాన్సెప్ట్ ఉంటే… అక్క‌డ ఉద్యోగ భ‌ద్ర‌త ఉంటుంద‌ని, అక్క‌డికెళ్లి ఇబ్బంది ప‌డ‌కుండ ఉంటార‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఎట్ట‌కేల‌కు షూటింగ్ ట్రాక్ ఎక్కిన స‌ర్కారు వారి పాట‌

ఎట్ట‌కేల‌కు షూటింగ్ ట్రాక్ ఎక్కిన స‌ర్కారు వారి పాట‌

స‌లార్ లో ప్ర‌భాస్ తో రొమాన్స్ చేయ‌నున్న శృతి హాస‌న్

స‌లార్ లో ప్ర‌భాస్ తో రొమాన్స్ చేయ‌నున్న శృతి హాస‌న్

మ‌హా స‌ముద్రంలో పాయ‌ల్ రాజ్ పుత్...?

మ‌హా స‌ముద్రంలో పాయ‌ల్ రాజ్ పుత్…?

మహాశివరాత్రికి గాలి సంపత్

మహాశివరాత్రికి గాలి సంపత్

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

రైతుల ర్యాలీ భ‌గ్నానికి ఉగ్ర కుట్ర‌

రైతుల ర్యాలీ భ‌గ్నానికి ఉగ్ర కుట్ర‌

మ‌ళ్లీ భార‌త్-చైనా సైన్యాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

మ‌ళ్లీ భార‌త్-చైనా సైన్యాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

పంచాయితీ ఎన్నిక‌ల‌పై హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్

పంచాయితీ ఎన్నిక‌ల‌పై హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్

కూతుళ్ల‌ను క్షుద్ర‌పూజ‌ల్లో బ‌లిచ్చిన త‌ల్లితండ్రుల స‌మాధానం ఏంటో తెలుసా...

కూతుళ్ల‌ను క్షుద్ర‌పూజ‌ల్లో బ‌లిచ్చిన త‌ల్లితండ్రుల స‌మాధానం ఏంటో తెలుసా…

గోల్డ్ మెడ‌ల్ చ‌దువులు క్ష‌ద్ర‌పూజ‌ల మాయ‌ను ప‌సిగ‌ట్ట‌లేక‌పోయాయా...?

గోల్డ్ మెడ‌ల్ చ‌దువులు క్ష‌ద్ర‌పూజ‌ల మాయ‌ను ప‌సిగ‌ట్ట‌లేక‌పోయాయా…?

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)