టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నికలు వచ్చింది కాంట్రాక్టుల కోసం కాదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేయడానికి వచ్చిందని పేర్కొన్నారు.
కేటీఆర్ మాటలు దొంగనే దొంగా దొంగా అన్నట్లు ఉందన్నారు. మునుగోడు బై ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ నాయకులను పిచ్చొలను చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు వీరికి పిచ్చే ఉంది అనుకుంటే తిర్రి కూడా అయ్యిందని డీకే అరుణ విమర్శించారు.
దేవుడిని నమ్మనని గతంలో చెప్పిన మంత్రి యాదాద్రిపై ప్రమాణం చేయమని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. యాదగిరి గుట్టకు చుట్టూ నాలుగు గోడలు కట్టి జైలు లాగా తయారు చేశారన్నారు. తాము కట్టినం అని చెప్పడం సిగ్గుగా లేదా అని ఆమె ప్రశ్నించారు.
అబద్ధాలు చెప్పే జాతి మీదని, అందరూ మీ లాగా ఉంటారనుకోవడం తప్పన్నారు. సోయి ఉండి మాట్లాడాలని, సీఎం కేసీఆర్ మాదిరిగా సోయి తప్పి మాట్లడవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ.