బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇజ్జత్, మానం ఉందా అంటూ నిప్పులు చెరిగారు. అసలు ఎంపీలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కనీసం ఒక్క పరీక్ష అయినా రాశారా? అంటూ ప్రశ్నించారు.
గుజరాత్‌కు చెప్పులు మోస్తున్నావా బండి సంజయ్? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దోస్త్ కోసం ప్రధాని మోడీ బొగ్గు, విమానాలు రాసి ఇస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త అదానీలే డబుల్ ఇంజన్లు అంటూ ఎద్దేవా చేశారు.
బీఎల్ సంతోష్ ఓ బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనాలని చూసినోడిని ఏమనాలి? అంటూ మండిపడ్డారు. మోడీ తమ మీద కాదు సంజయ్ మీద దాడి చేయాలన్నారు. కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పాలని సంజయ్ ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రిని పట్టుకుని బ్రోకర్ అంటావా? అని సంజయ్ ని అడగండన్నారు. అదానీకి నీ ప్రధాని బ్రోకర్ అని మేము అనలేమా? అని అన్నారు. తాను సిరిసిల్లకు ఎన్నో విద్యా సంస్థలను తెచ్చానన్నారు. నువ్వు తెచ్చిన ఓ చిన్న బడిని చూపెట్టు సంజయ్ అంటూ సవాల్ విసిరారు.
అదానీకి నీ ప్రధాని బ్రోకర్ అని మేము అనలేమా?.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు…!