టీఆర్ఎస్ పాలనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శల్ని మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ పాలనపై మహబూబ్నగర్ సభలో నడ్డా ప్రస్థావించారు. వాటికి స్పందించిన కేటీఆర్.. మోడీ పాలనలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని విమర్శించారు.
గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లోనే వంట గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు.
దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు కేటీఆర్.