విశ్వ విఖ్యాత వేదిక మీద తెలుగువారి సత్తా చాటి ఆస్కార్ అవార్డును అందుకున్న ఆర్‌ఆర్ ఆర్ బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చిత్ర బృందానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
ఈ క్రమంలో నాటునాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకను జరుపుకుంటున్న కోట్ల మంది భారతీయుల్లో నేను కూడా ఒకడిని అంటూ ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
ట్రిపుర్ ఆర్ చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. ఈ గొప్ప క్షణానికి కారకుడు, అద్భుతమైన కథకుడు రాజమౌళి భారతదేశాన్ని గర్వపడేలా చేశారు. నా సోదరులు చరణ్, తారక్ ఇద్దరు కూడా సూపర్ స్టార్స్. తమ డ్యాన్స్‌తో రంజింపజేశారు అంటూ ట్విట్ చేశారు.