పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సెస్‌లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నాస్తం సంధించారు. తాను చైనీస్ టార్చర్ గురించి పుస్తకాల్లో మాత్రమే చదివానని.. కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12 సార్లు లీటర్ కు 80 పైసల చొప్పున పెట్రోల్ ధరలు పెంచి అన్ని రకాల టార్చర్లను తిరగరాస్తున్నారని విమర్శించారు.
ప్రపంచంలోనే బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త రికార్డు సృష్టిస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాము గత ఏడేండ్లుగా తాము వ్యాట్‌ను పెంచలేదని చెప్పారు. ఎన్‌డీఏ పభ్వుతం విచాక్షణా రహితంగా పెంచిన సెస్సులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని, దీనివల్ల ఇంధన ధరలు కనీసం 30 తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
గత 14 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8.40 పెరిగిందని అన్నారు కేటీఆర్. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా.. ప్రస్తుతం లీటరుకు రూ.103.81కి పెరిగిందని పేర్కొన్నారు. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.36, డీజిల్ లీటరుకు రూ.99.44 గా ఉందని.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉందన్నారు.
ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.60గా ఉందని గుర్తు చేశారు. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.81 కు ఎగబాకిందన్నారు. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 118.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.10కి పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ తో పోలిస్తే ఏపీలో చమురు ధరలు ఎక్కువగానే వున్నాయని గుర్తుచేశారు. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.55కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.90 అమ్ముతున్నారని వివరించారు.