ఐక్య రాజ్య సమితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ ప్రాముఖ్యత సహా వ్యూహాత్మక అంశాలపై నిక్కి హెలీతో మంత్రి కేటీఆర్ చర్చించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్నికలు, రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. నిక్కీ హెలీతో దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. నిక్కి హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ క్రమంలో ఆమెకు మంత్రి కేటీఆర్ బెస్ట్ విషెస్ చెప్పారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నాయి.
హైదరాబాద్ లో డెలివరీ సెంటర్ విస్తరణను చేపట్టనున్నట్టు అంతర్జాతీయ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ నిన్న వెల్లడించింది. హైదరాబాద్ లో డేటా సెంటర్ ను అభివృద్ధి చేసేందుకు 50 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ఔరమ్ ఈక్విటీ పార్ట్ నర్స్ సంస్థ వెల్లడించింది.