మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. డ్రామారావ్ అంటూ మండిపడ్డారు. సరైన సమాచారం లేని మంత్రి కేటీఆర్… మొన్న ఆరు ఏళ్ల పాపపై అఘాయిత్యం జరిగినప్పుడే సరిగ్గా స్పందించి ఉంటే, ఈ రోజు మంగల్ హట్ లో 9 ఏళ్ల పాపపై మరో మృగాడు అఘాయిత్యానికి ప్రయత్నించకపోయేవాడని మండిపడ్డారు.
తెలంగాణలో మీ ఏడు సంవత్సర పాలనలో పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు 300శాతం పెరిగాయని, ఇది మీ పాలన అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించిన మీడియా క్లిప్స్ ను కూడా తన ట్వీట్ కు రేవంత్ రెడ్డి జత చేశారు.
డ్రామా రావ్ అంటూ రేవంత్ చేసిన ట్వీట్ ఇదే-
If “Mis Informed” minister KTR had some control over governance,attempt to molest a 9 year old today in Mangal Hat would not have happened even before we forget Singareni colony incident. POCSO offences have increased by 300% in the past seven years in Telangana. #DramaRao pic.twitter.com/XGk1Lp6Zcc
— Revanth Reddy (@revanth_anumula) September 16, 2021
Advertisements