ఆరంభ శూరత్వం గురించి తెలుసుగా.. ఇది మంత్రి కేటీఆర్ చేపట్టిన సన్ డే.. డ్రై డే కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందేమో. సీజనల్ వ్యాధుల నివారణకు నాయకులు, అధికారులు పరిసరాలను శుభ్రం చేయాలని 2019 సెప్టెంబర్ లో క్యాంపెయిన్ చేశారాయన. ప్రతీ ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు అందరూ ఇది పాటించాలని పిలుపునిచ్చారు. కొన్ని వారాలపాటు కేటీఆర్ తోసహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు అందరూ హడావుడిగా డ్రైడేని నిర్వహించారు. ఇళ్లు, ఆఫీసుల్లో క్లీన్ చేశారు.
సీన్ కట్ చేస్తే…
కొన్నాళ్లకు డ్రై డే కార్యక్రమం సైలెంట్ అయిపోయింది. నాయకులంతా ఉత్సాహంగా పాల్గొన్న సమయంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల సంఖ్య తగ్గిందని వైద్యాధికారులు ప్రకటన కూడా విడుదల చేశారు. మరి.. అంత సత్ఫలితాలని ఇచ్చిన కార్యక్రమాన్ని మధ్యలోనే ఎందుకు నిలిపివేశారనే విమర్శలు వస్తున్నాయి. మళ్లీ దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక పిలుపునివ్వడం.. కొద్దిరోజులు సందడి చేయడం.. తర్వాత మర్చిపోవడం.. ఇది కరెక్ట్ కాదని సెటైర్లు వేస్తున్నారు.