పార్లమెంటరీ పార్టీ మీటింగ్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేయటంపై అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు గులాబీ శ్రేణుల్లోనూ జోరుగా చర్చ జరుగుతుంది. కేసీఅర్ రాకుండా కేటీఆర్ అధ్యక్షతన ఎంపీల సమావేశంలో ఆంతర్యం ఏమై ఉంటుంది…? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరు కావడం ఇదే మొదటిసారి. దీని ద్వారా ఇటు రాజకీయ వర్గాలకు అటు క్యాడర్ కు కేసీఆర్ ఏమి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది.
కేసీఅర్ అందుబాటులో లేడు అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ వస్తున్నాడు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే కేసీఅర్ ప్రతిరోజూ ప్రగతి భవన్ లో ఆర్టీసీ మీద అధికారులతో గంటలు గంటలు రివ్యూ చేస్తున్నారు. పైగా శుక్రవారం సీఎం కు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉందా అంటే అదికూడా ఏమి కనపడటంలేదు. పైగా పార్లమెంటరీ పార్టీ సమావేశం కు పెద్దగా ప్రాధాన్యత లేనిదా అంటే అదీ కాదు… మరో నాలుగు రోజులలో ప్రారంరంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించాలి, కేంద్ర ప్రభుత్వం తో మనం ఏ వైఖరి తో ఉండాలి లాంటి విషయాలను చర్చించి పార్టీ వ్యూహాన్ని రచించాలి.
ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ తన దూకుడిని పెంచింది, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు లో కేంద్రంతో ఎలా ఉండాలనే అంశం కీలకంగా చర్చించాల్సి ఉంది. ఇంతటి ముఖ్య సమావేశానికి కేసీఅర్ కాకుండా కేటీఆర్ ను పంపడం వెనుక ఏదో వ్వుహం ఉందని అంటున్నారు ఏమిటా వ్వూహం ఏమిటా కథ అనేది రాబోయే కాలంలో తేలాల్సి ఉందని గుస గుస లాడుకుంటున్నారు గులాబీ నేతలు.