నందమూరి అందగాడు బాలయ్య బాబు తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అస్ స్టాపబుల్. ఇప్పుడిది ‘ఆహా’ ఓటిటికి వరంగా మారింది. సీజన్ 2 అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. దీనికి మరింత జోష్ పెంచేలా షోటీమ్, నిర్మాణ వర్గం ఇంట్రస్టింగ్ సెలెబ్రిటీలతో రసవత్తరంగా నడిపిస్తోంది.
సినిమా,రాజకీయం వంటి పలు రంగాల వ్యక్తులను గెస్ట్ లు గా తీసుకువచ్చి అభిమానులకు ఇంట్రస్ట్ ని పెంచుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు – లోకేశ్ తో ప్రారంభించిన ఈ సీజన్ అన్ స్టాపబుల్ టైటిల్ జస్టిఫై చేస్తోంది.అందుకే ఈ రెండు సీజన్లలోనూ సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ కారణంగానే సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ టీమ్ నుంచి కాల్ రాగానే పరిగెత్తుకొస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ మరో ఇంట్రస్టింగ్ కాంబోని ఇన్వైట్ చేయనుంది. ఇప్పటికే బాలయ్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సిద్ధమవుతున్న ఎపిసోడ్ పై భారీ అంచనాలున్నాయి. ఎపిసోడ్ షూటింగ్ ప్రశ్నలు – సమాధానాలపై లీకులే పలువెబ్ సైట్స్ కి, యూట్యూబ్,న్యూస్ ఛానెల్స్ కి విందుభోజనమయ్యాయి.
అయితే పూర్తి ఎపిసోడ్స్ కోసం సిని,రాజకీయ, ప్రేక్షక, అభిమాన వర్గాల నిరీక్షణ పర్వం నడుస్తోంది. తాజాగా పొలిటికల్ – మూవీ కాంబోలో ఒక ఎపిసోడ్ రానుందని టాక్. మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ లతో కలిపి ఎపిసోడ్ వస్తుందన్న సమాచారం ఊపందుకుంది. ఇప్పటి వరకు సినిమా,పొలిటికల్ సెలబ్రిటీలతో షోచేస్తున్న నిర్వాహకులు ఈ సారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని, ఈ సంక్రాంతి లోగా ఈ ఎపిసోడ్ షూట్ అవుతుందని వినికిడి.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. రామ్ చరణ్ ఇప్పటికే ఓకే చెప్పగా మంత్రి కేటీఆర్ డేట్ కి క్లారిటీ రావాల్సి ఉంది. మంత్రి కేటీఆర్ మెగాఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. వినయ విధేయ రామా ప్రీరిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ విచ్చేయడం చూసాం.
ఇటీవల ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నేపథ్యంలో రామ్ చరణ్ ఫోన్ కాల్ లోకి వచ్చినప్పుడు షోకు ఎప్పుడొస్తావని అని బాలయ్య అడగడం చరణ్ సానుకూలంగా స్పందించడం తెలిసిందే. దీంతో రీల్ కమ్ రియల్ హీరోలు అన్ స్టాపబుల్ కి రావడం ఖాయమని తెలుస్తోంది.
కాగా ,త్వరలో ప్రసారం కానున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు జనసేనాని వ్యక్తిగత జీవితంపైన వస్తున్న ఆరోపణలకు పూర్తిస్థాయి సమాధానంతో ఇక ఎవరూ ఆ అంశాలు లేవనెత్తకుండా గట్టిసమాధానం ఇచ్చిన ప్రస్తావనపై ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు కేటీఆర్, రామ్ చరణ్ కాంబోలో బాలయ్య నిర్వహించే షో గురించి సినీ, పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఆహా ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.