• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు.. రెండు రాష్ట్రాల నేతల ట్విట్టర్‌ చర్చ..!

హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు.. రెండు రాష్ట్రాల నేతల ట్విట్టర్‌ చర్చ..!

Last Updated: April 4, 2022 at 2:17 pm

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కు ట్విట్టర్‌ హీరో అనే పేరుంది. ఈయన బయటకన్నా అందులోనే ఎక్కువ యాక్టివ్‌ గా ఉంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆమధ్య అమెరికా టూర్ వెళ్లి.. అక్కడి విశేషాలను వివరించిన ఆయన వచ్చాక.. కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ ట్వీట్లాస్త్రాలు సంధిస్తున్నారు.

అయితే.. ఇదే సమయంలో కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కు, కేటీఆర్‌ కు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. బెంగళూరును స్టార్టప్ హబ్‌ గా, సిలికాన్ వ్యాలీగా పిలుస్తుంటారు. కానీ.. అక్కడ రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయని, విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని ఈమధ్య కొందరు స్టార్టప్ ఫౌండర్లు ట్విట్టర్‌ లో పోస్టులు పెట్టారు. వాటిపై స్పందించిన కేటీఆర్‌.. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్‌ వచ్చేయండి అంటూ నాలుగు రోజుల క్రితం ట్వీట్‌ చేశారు.

Pack your bags & move to Hyderabad! We have better physical infrastructure & equally good social infrastructure. Our airport is 1 of the best & getting in & out of city is a breeze

More importantly our Govt’s focus is on 3 i Mantra; innovation, infrastructure & inclusive growth https://t.co/RPVALrl0QB

— KTR (@KTRTRS) March 31, 2022

కేటీఆర్ చేసిన అప్పటి ట్వీట్‌ కు తాజాగా శివకుమార్ స్పందించారు. కేటీఆర్ సవాల్‌ ను స్వీకరిస్తున్నామని 2023 డిసెంబర్ నాటికి కర్నాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు దేశంలోనే ఉత్తమ నగరంగా బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకొస్తామని పోస్ట్‌ చేశారు.

.@ktrtrs, my friend, I accept your challenge. By the end of 2023, with Congress back in power in Karnataka, we will restore the glory of Bengaluru as India’s best city. https://t.co/HFn8cQIlGS

— DK Shivakumar (@DKShivakumar) April 4, 2022

శివకుమార్‌ ట్వీట్‌ కు రిప్లై ఇచ్చారు కేటీఆర్‌. తానూ సవాల్‌ ను స్వీకరిస్తున్నానని.. కర్నాటక రాజకీయాల గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. ఎవరు గెలుస్తారో తెలియదని చెప్పారు. కానీ.. హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ ఆరోగ్యకరమైన పోటీతో యువతకు ఉద్యోగాలు కల్పించి దేశ అభివృద్ధికి పాటుపడదామని సూచించారు. హలాల్, హిజాబ్‌ పై కాకుండా మౌలిక సదుపాయాలు, ఐటీ, బయో టెక్నాలజీ రంగాలపై దృష్టి సారిద్దామని శివకుమార్‌ కు వివరించారు కేటీఆర్‌. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ వైరల్‌ అవుతోంది.

Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍

Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation

Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT

— KTR (@KTRTRS) April 4, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

భళా కేజ్రీవాల్‌.. కేసీఆర్‌ ప్రశంసలు!

తొలివెలుగు కథనానికి స్పందన.. చెంచులక్ష్మికి చేయూత!

ఎవరి సొమ్ము.. ఎవరికి? పద్దతేనా సారూ?

పోలీసులు ఎందుకు కాకీ దుస్తులే ధరిస్తారు…?

తగ్గేదే లే.. ఆర్చరీ వరల్డ్ కప్ లో స్వర్ణం!

అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ముసుగు ఎందుకు వేస్తారు…?

బ్రేకింగ్‌… భారీగా తగ్గిన పెట్రోల్‌ రేట్లు

బిల్లి బౌడెన్ కు ఆ వ్యాధి ఉండటమే ప్లస్ అయిందా…? చేతులు అందుకే అలా లేపేవారా…?

క‌మీష‌న్ల కోసం కుస్తీలు.. బ‌స్తీలతో ప‌నేముంది..!

మోడీ హైదరాబాద్ వ‌స్తుంటే..కేసీఆర్ కు ఢిల్లీలో ఏం ప‌ని..!

అప్పుడు ధ‌నిక రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల కుప్ప‌..!

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఫిల్మ్ నగర్

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

Sarkaru Vaari Paata Movie OTT Release Date

ఆ డైలాగ్ పై నమ్మకం లేదన్న మహేష్

కీర్తి పేరు మారింది.. ఇకపై అలాగే పిలవాలట!

కీర్తి పేరు మారింది.. ఇకపై అలాగే పిలవాలట!

విమానంలో మూడు గంటలు.. బాలీవుడ్ నటి అవస్థలు

విమానంలో మూడు గంటలు.. బాలీవుడ్ నటి అవస్థలు

త‌మిళ్ సినిమాలో.. గ్లామర్ బ్యూటీ..!

త‌మిళ్ సినిమాలో.. గ్లామర్ బ్యూటీ..!

కేజీఎఫ్-2.. మ‌రో అరుదైన రికార్డ్..!

కేజీఎఫ్-2.. మ‌రో అరుదైన రికార్డ్..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)