తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్.. మరోసారి ట్వీట్ చేశారు.
ఎప్పుడు హాట్ కామెంట్స్ తో ట్వీట్ చేసే కేటీఆర్.. ఈ సారి కాస్త వ్యంగ్యాన్ని జోడించారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 250 పెరిగి.. 2,253కు చేరిందన్న వార్తా కథనంపై మంత్రి చమత్కారంగా స్పందించారు.
ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని వ్యంగ్యాస్త్రాలు సందించారు. అంతేకాకుండా ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్ కి స్పందించిన ఆయన రిట్వీట్ చేశారు.
తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే ఉంటానని.. అది చూసి తట్టుకోలేనివారు దయచేసి తనను అన్ ఫాలో కావాలని సూచించారు. ఏప్రిల్ ఫూల్ జోక్ కావాలని తాను సీరియస్ గా భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.