టీఆర్ఎస్లో ముదిరిన వార్
హైదరాబాద్: టీఆర్ఎస్‌లో ‘కేటీఆర్ వర్సెస్ ఈటల మాటల వార్’ మరింత ముదిరింది. ‘పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నార’ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తించుకోవాలని హితవు పలికారు. ఈ మాటలన్నీ ఈటలను ఉద్దేశించి పరోక్షంగా అన్నవేనని స్పష్టంగా అర్ధం అవుతోంది.
మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి ఓనర్లం తామేనని, తనకు వచ్చిన పదవి ఎవరి భిక్షా కాదని ఆవేశంగా మాట్లాడారు. ‘కొడకా…’ అంటూ సంభోదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈటల తాను కులం పేరుతో మంత్రి పదవి సాధించలేదని, ప్రజల అండతోనే నెగ్గి మంత్రినయ్యానని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఈటలను ఉద్దేశించి కేటీఆర్ పరోక్షంగా చేసిన కామెంట్లు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈటల మాటలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలియడంతో పార్టీలో లుకలుకలు బయల్దేరాయి.