తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10జిల్లాల తెలంగాణను 33జిల్లాలు చేశామని… కానీ ఎక్కడా చిన్న వ్యతిరేకత రాలేదని కానీ ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఎందుకంత వ్యతిరేకత వస్తుందో, ఆ 29గ్రామాల ప్రజలు ఎందుకంత పోరాడుతున్నారో అర్థం చేసుకోవాలంటూ కామెంట్ చేశారు కేటీఆర్. మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇటీవల సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఏపీలో మూడు రాజధానుల అంశం చర్చకు రాగా… అభివృద్ది వికేంద్రీకరణ మంచి పని అని, అభివృద్ధి అన్ని జిల్లాలకు ప్రాంతాలకు చేరేలా చూడటం ప్రభుత్వాల కర్తవ్యమని… కేసీఆర్ జగన్‌ను సమర్థించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ మాత్రం జగన్ మూడు రాజధానుల విషయంలో భిన్నంగా స్పందించటంపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన మంత్రి కేటీఆర్… పవన్ పార్టీ అంతర్జాతీయ పార్టీ అవుతుందేమోనని సెటైర్స్ వేశారు.