‘సాహో’ మూవీ మేకర్స్‌ని అందరూ దాదాపు తిట్టిపోశారు. ఫేస్‌బుక్‌లో అయితే గ్రంధాలకు గ్రంధాలు రివ్యూలు రాస్తున్నారు. ఒకాయన అయితే సాహో చూసొచ్చి తన ఫ్లాట్‌లోకి వెళ్లబోయి పక్క ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపేశాడట. వెంటనే ఆ ఇల్లాలు కెవ్వు కేక. ఇలా సాగుతున్నాయి సాహో బాధితుల ముచ్ఛట్లు. వీటితో తలబొప్పి కట్టిన ప్రభాస్ అండ్ టీమ్‌కి కేటీఆర్ పెద్ద రిలీఫ్‌గా దొరికాడు. సాహో చూసొచ్చిన కేటీఆర్ సిన్మా సూపరహె.. అంటున్నాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా వుండే కేటీఆర్ సినిమాలూ అవీ బాగానే చూస్తుంటాడు. సోషల్ మీడియాలో కాంటెంపరీ విషయాలపై ఫోకస్ పెడుతూనే వుంటున్నట్టు కనిపిస్తుంటాడు. సాహోపై కేటీఆర్ చేసిన కమెంట్ ఇప్పుడు డార్లింగ్ పాన్స్‌కు కాస్త కిక్ ఇచ్చింది. ‘సాహో సాంకేతిక అద్భుతం. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ స్థాయి పెంచిన మూవీ. హీరో ప్రభాస్, డైరెకర్ సుజిత్‌కు అభినందనలు.’ ఇదీ కేటీఆర్ కాంప్లిమెంట్.
జెండా మోసిన మేమే టీఆర్‌ఎస్ ఓనర్లమని మంత్రి ఈటల చేసిన కామెంట్ తరువాత మైండ్ బ్లాంక్ అయిన టీఆర్ఎస్ లీడర్లు రిలీఫ్ కోసం సాహో చూసొస్తున్నారని టాక్. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది.