మంత్రి కేటీఆర్ నెటిజన్లకు మళ్లీ మళ్లీ దొరికిపోతున్నారు. తప్పుడు వివరాలతో ట్వీట్లు చేస్తూ పట్టుబడిపోతున్నారు. సింగరేణి కాలనీ చిన్నారి నిందితుడి విషయంలో మొదలైన తడబాటు.. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. తెలంగాణలో పొలాల్లోకి వెళ్లి మరీ హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్లు వేస్తున్నారని గొప్పలు చెప్పుకోబోయి, ఏపీకి చెందిన ఫోటోను పోస్ట్ చేసి భంగపడిన కేటీఆర్.. దాన్ని కవర్ చేసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. వివరణ ఇస్తూ మళ్లీ నెటిజన్లకు బుక్కయ్యారు.
These are the two news items 👇 from Eenadu & Sakshi that I had used for my tweet above
It is a fact that Telangana Healthcare workers have been doing a terrific job and let’s appreciate them pic.twitter.com/iAB0Rk1tyR
— KTR (@KTRTRS) September 24, 2021
Advertisements
తాను ఈనాడు, సాక్షి పేపర్లలో వచ్చిన ఫోటోలనే తన ట్వీట్‌లో వాడుకున్నానని.. తెలంగాణలో హెల్త్ వర్కర్లు నిజంగానే గొప్ప పనిచేస్తున్నారని కొనియాడారు. అయితే వివరణ ఇచ్చే ట్వీట్‌లోనూ కేటీఆర్ పొరపాటు పడ్డారు.తాను మొదట చేసిన ట్వీట్‌లో ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఫోటోలు అంటూ షేర్ చేశారు కేటీఆర్. కానీ తాను రిఫరెన్స్ తీసుకున్న ఫోటోల్లో రాజన్న సిరిసిల్ల అని ఉంది కానీ.. ఖమ్మం పేరు లేదు. బదులుగా నల్గొండ జిల్లా అని ఉంది. దీంతో ఏ జిల్లా ఆరోగ్య కార్యకర్తల క్రెడిట్‌ని ఏ జిల్లాకు ఇస్తున్నారంటూ నెటిజన్లు క్వచ్ఛన్ చేయడం మొదలుపెట్టారు.
మరికొందరు నెటిజన్లు.. నమస్తే తెలంగాణ ఉండగా ఆంధ్రా పేపర్లు ఈనాడు, సాక్షిల ఫోటోలను షేర్ చేయాల్సి అవసరం ఏమొచ్చిందో అని సెటైర్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి.. కేటీఆర్ అర్జెంట్‌గా పీఆర్ టీంను మార్చుకోవాలని, లేదంటే ఎన్ని పొరపాట్లు చేయాల్సి వస్తుందో మరి చూసుకోండి అంటూ సూచన చేస్తున్నారు.