ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మరోసారి ట్వీట్ చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి.. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ట్వీట్ చేశారు.
సీసీఐ పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సహకాలు అందిస్తామని పేర్కొన్నారు మంత్రి.
”కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు.. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పునఃసమీక్షించుకోండి. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం.” అంటూ ట్వీట్ లో రాశారాయన.
అయితే.. ఇటీవల ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై చానల్ లోనూ, పత్రికలోనూ వచ్చిన కథనాలకు స్పందించారు కేటీఆర్. దీంతో తన అభిప్రయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ట్వీట్ చేశారు కేటీఆర్.