– ఇద్దరి మధ్య ఆగని ట్వీట్ వార్
– బండి క్షుద్రపూజల వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
– వెంటన్ కౌంటర్ ఇచ్చిన సంజయ్
– మరోసారి ఘాటుగా స్పందించిన కేటీఆర్
– పంచాయితీ ఆగేలా లేదంటున్న నెటిజన్లు
తాంత్రికుడి సలహాతో కేసీఆర్ ఫాంహౌజ్ లో నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు చేస్తున్నారని శనివారం బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. దానికి బండి కూడా అదేస్థాయిలో మండిపడ్డారు. తాజాగా మరోసారి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘కొంతమంది తాము చెప్పుకోడానికి ఏం లేక నల్లపిల్లులు, తాంత్రికులు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని.. రాష్ట్రానికి మీరేం(కేంద్ర ప్రభుత్వం) చేశారో చెప్పడానికి ఏం లేదు కాబట్టే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని అన్నారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది జీరో అంటూ కేటీఆర్ ఫైరయ్యారు. పిచ్చోడి చేతిలో రాయి-లవంగం చేతిలో బీజేపీ అంటూ ఘాటుగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడి బండి సంజయ్.. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం టీఆర్ఎస్ పేరును మార్చారని.. చాలా రోజులుగా కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తాంత్రికుడి సూచనతోనే పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. మూడు నెలలకొకసారి నల్లపిల్లితో పూజలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా తాంత్రికుడి అనుమతి తీసుకుంటారని అన్నారు. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తాంత్రికుడి మాటలు విని కొత్త సచివాలయ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు.
బండి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
మంత్రి ట్వీట్ పై వెంటనే రియాక్ట్ అయ్యారు సంజయ్. ‘‘ఆ ట్విట్టర్ టిల్లు గారి మాదక ద్రవ్యాల డోసేజ్ ని కంట్రోల్లో పెట్టండ్రా పింకీలు. మీలాంటి లంగాలూ, లఫంగాలతోనే సమాజానికి పెను ప్రమాదం. ఇంటి యజమానిని కరిచే కాపలా కుక్కలు.. కంటికి అంజనం రుద్దుకొని తిరిగే క్షుద్ర మంత్రగాళ్లు.. మాదక ద్రవ్యాలు సేవించే బ్లాక్ మెయిలర్స్.. మత్తెక్కి తైతక్కలాడే లిక్కర్ సీసాలు.. కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డాయి. తన్ని తరిమేయకుంటే రాష్ట్రానికి, దేశానికే ప్రమాదం. పోయి వెటర్నరీ డాక్టర్ కు చూపించుకొండ్రా పింకీలు’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంపై కేటీఆర్ మరోసారి స్పందిస్తూ.. బండిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు మీ గిల్లికజ్జాలు భలే గున్నాయని కామెంట్లు పెడుతున్నారు.