హైదరాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి ‘హత్యా’చార నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారని ట్వీట్ చేసి అటు సోషల్ మీడియాలో, ఇటు బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న మంత్రి కేటీఆర్ చివరికి తప్పు ఒప్పుకున్నారు.’నిందితుడు ఎక్కడ’ అని 48 గంటలుగా అందరూ ప్రశ్నిస్తున్నా పట్టించుకోని మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తాజాగా ట్విట్టర్లో ఇదే ప్రశ్న అడగడంతో మంత్రి సమాధానం చెప్పక పరిస్థితి ఏర్పడింది.
Days after the irresponsible minister KTR tweets the culprit is caught within hours in the case of 6 year old sexually molested & murdered,@hydcitypolice announces Rs10 lakh to whoever gives a clue on absconding accused.I wish CM took this case as seriously as Huzurabad election pic.twitter.com/oy1ClwV1fe
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2021
బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. హత్యకు గురైన కేసులో నిందితుడు గంటల వ్యవధిలో పట్టుబడ్డాడని కేటీఆర్ ట్వీట్ చేశారని.. కానీ పోలీసులేమో నిందితుడి ఆచూకీ చెబితే రూ.పది లక్షలు ఇస్తామని ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు. ఈ కేసును హుజురాబాద్ ఎన్నికలాగే ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకుంటే బాగుంటుందని సీరియస్ కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.
మంత్రి తన ఓల్డ్ ట్వీట్ సరిచేసుకున్నట్లు పోస్ట్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, తప్పుడు ప్రకటనకు చింతిస్తున్నాని చెప్పారు. నేరస్తుడు పరారీలో ఉన్నాడని, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారని తెలిపారు. త్వరగా పట్టుకునేందుకు అందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు.
Would like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement
The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him
Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly https://t.co/IVz9Ri7jzn
— KTR (@KTRTRS) September 14, 2021