మహాకూటమి తరపున కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించారు ఆమె. టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్రను వెంటనే బదిలీ చేయాలని కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను టీఆర్ఎష్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలోని అల్లాపూర్, ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *