కడప: భారీ వర్షాలకు కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దముడియం, రాజుపాలెం, దువ్వూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రొద్దుటూరు మండలం రాధానగర్ సమీపంలో కుందూనదిపై రోడ్డు దాటుతూ ఆటో వరదలో కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.