కర్నూలు : మహానంది ఆలయం జల దిగ్బంధంలో ఉంది. ఈ ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. నీట మునిగిన పంచలింగాల మంటపం, కోనేరు వరదలతో మహానంది ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహానంది మండలంలో 162.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మహానందిలో వర్షం కుంభవృష్టిగా వుంది. మహానంది దేవస్థానం జలమయంగా మారింది. దేవస్థానం దారులన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మహా సముద్రంగా మహానంది