కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్ రావడంతో ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకుంటున్నప్పటికి 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు తెరుచుకోవచ్చని రాష్ట్రప్రభుత్వాలు అనుమతించాయి.
అయితే థియేటర్లలోకి 100% ప్రేక్షకులను అనుమతిస్తే సినిమా పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ మహిళా నాయకురాలు సినీ నటి ఖుష్బూ అన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కోరారు. వందశాతం ప్రేక్షకులను అనుమతించకపోతే పరిశ్రమ మరింత కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.