విజయ్ దేవరకొండ-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయింది. కశ్మీర్ లోని మంచు కొండల్లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తి చేశారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. గత నెల 23న షూటింగ్ ప్రారంభించారు. ఈనెల 23న క్లోజ్ చేశారు.
కశ్మీర్ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల మధ్య కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. దేవరకొండ-సమంత మధ్య వచ్చే లవ్ ఎమోషనల్ సీన్లు, ఓ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మరో షెడ్యూల్ ను విశాఖ, అలెప్పిలో ప్లాన్ చేశారు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తూ, వర్కింగ్ స్టిల్స్ కూడా వదులుతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకేసారి సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలకానుంది ఖుషి.