‘ఖుషి’ పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. పవన్ కళ్యాణ్ స్టైల్ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ఇది. 2001లో ఎస్.జె.సూర్య డైరెక్షన్లో సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం.
బి. గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య బాబు నటించిన చిత్రం నరసింహానాయుడు. బాలయ్యకు సమర సింహారెడ్డి తర్వాత అదేరేంజ్ హిట్టిచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది. అయితే ఖుషి, నరసింహనాయుడు సినిమాలు రెండూ ఒకేటైమ్ లో రిలీజ్ అయ్యాయి.
నరసింహనాయుడు సినిమా ఒకవైపు రికార్డులను తిరగరాస్తూ క్రౌడ్ పుల్లింగ్ చేస్తే…యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఖుషి’ కుర్రాళ్ళను ఉర్రూతలూగించింది.
ఆ యేడాది ఈ రెండు సినిమాలు పోటాపోటీగా ఆడినా అప్పటి లెక్కల ప్రకారం నరసింహానాయుడు ఖుషి మీద కాస్త పై చేయి సాధించిందని చెప్పవొచ్చు. బేసిక్ గానే మాస్ సినిమాలకు వచ్చే రెస్పాన్స్ కలెక్షన్ల కథ వేరేలా ఉంటుంది కదా మరి.
సెంటర్స్ పరంగా చూస్తే…ఖుషి 79 కేంద్రాల్లో100 రోజులు ఆడితే.. నరసింహ నాయుడు105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఖుషి మూవీ 21 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే నరసింహానాయుడు 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
Also Read: సినీరంగంలో సరోగసీ పేరెంట్స్…!