లద్దాఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టర్టుక్ సెక్టార్ లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందగా.. మరో 19మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆర్మీ నుండి వైమానిక దళాల మద్దతు కోరినట్లు వారు తెలిపారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా.. గాయాలపాలైన సైనికులను ఆస్పత్రులకు తరలించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 26మంది జవాన్లు ఉన్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.