నారీ మణులు మనుసు మార్చుకుంటున్నారు. పసిడిని అమితంగా ప్రేమించే భారతీయ మహిళలు.. పెట్టుబడిపై కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఎక్కువ రిటర్న్ వచ్చే వాటిపై పెట్టుబడి పెడుతున్నారు. దీనికి స్టాక్ మార్కెట్లే ఉత్తమం అని భావిస్తున్నారు. బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే మహిళలు గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లు వైపు చూస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి మన జీవితంలో భాగం అయిన తరువాత మహిళల పార్టిసిపేషన్ పెరిగిందని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వారి వాటా 16 శాతం ఉండగా, ప్రస్తుతం అది 24 శాతానికి పెరిగింది.
జీరోధా, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ డైరెక్ట్, అప్‌స్టాక్స్, 5పైసా వంటి బ్రోకరేజ్ కంపెనీలు ఈ విషయాన్నే చెబుతున్నాయ. 2020, జనవరి 1 నుంచి చూస్తే సెన్సెక్స్, నిఫ్టీల సూచీలు 40 శాతం మేర పెరిగాయి. అంటే స్టాక్ మార్కెట్లు లాభాల బాటపడుతున్నాయి. దీన్ని గమనించిన మహిళలు గోల్డ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు నుంచి మనసు మార్చుకొని షేర్ మార్కెట్ వైపు చూస్తున్నారు. మగవారి కంటే ఆడవారికి కాస్త ఓపిక ఎక్కువ. స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడి పెట్టే వారికి కూడా ఉండాల్సిన మొదటి లక్షణం కూడా ఓపిక. కనుక మహిళలు ఇందులో సరిగా ఇమిడిపోతారని నిపుణులు చెబుతున్నారు.
యాక్సిస్ సెక్యూరిటీస్ డేటా ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళా ఇన్వెస్టర్ల వాటా 2018–19 లో 0.4 % ఉండగా, కిందటేడాది 1.5 శాతానికి పెరిగింది. 26–45 మధ్య ఏజ్ ఉన్నవారి వాటా 10.01 % నుంచి 12.3 శాతానికి ఎగిసింది. 45–60 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారి వాటా 4 % నుంచి 5.2 శాతానికి పెరిగింది. 60 ఏళ్లకు పైనున్న మహిళా ఇన్వెస్టర్ల వాటా 2.6 శాతానికి పెరిగింది. 2020 జనవరి తరువాత 10 లక్షల మంది మహిళలు కస్టమర్ల బేస్‌కు యాడ్ అయ్యారని అప్‌స్టాక్స్ పేర్కొంది. ఇందులో 60 % మంది 20–25 ఏళ్ల మధ్య ఉండగా, 85 శాతం మంది టైర్ 2, టైర్ 3 సిటీల నుంచే ఉన్నారు.
ఐసీఐసీఐ కూడా మహిళలపై ఇదే రకంగా స్పందించింది. షేర్లపైనే మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. 2018–19 లో తమ ఫ్లాట్ ఫాంలో మొత్తం పెట్టుబడిలో మహిళలు 56 శాతం వాటా ఉందేదని.. 2021–22 లో ఈ వాటా 67 శాతానికి పెరిగిందని వివరించింది. ఇదే టైమ్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయని పేర్కొంది.